పాపం.. జగన్కు ఇంకా అవగాహన ఏర్పడలేదనుకుంటా అంటూ వ్యంగ్యోక్తులు విసిరిన ఆర్కే.. ఆ విషయం తెలియకనే జగన్ యుద్ధాలు ప్రకటిస్తున్నారని.. మీడియాతో గానీ, న్యాయవ్యవస్థతో గానీ యుద్ధం చేయడం వల్ల నష్టపోయేది ఆయన మాత్రమేనని గట్టిగానే చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మెలగాలని సూచిస్తున్నారు ఆర్కే.