ఈడీ కేసుల విచారణకు, సీబీఐ కేసుల విచారణకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే.. సీబీఐ కేసుల్లో ముద్దాయిలు నేరం చేశారని రుజువు చేయాల్సిన బాధ్యత సీబీఐపైనే ఉంటుంది. ఈడీ ఇందుకు పూర్తి డిఫరెంట్.. ఈడీ కేసుల్లో ముద్దాయిలే తాము నేరం చేయలేదని రుజువు చేసుకోవలసి ఉంటుందన్నమాట.