తాజాగా హైదరాబాద్ వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా మరో వ్యక్తి అతడి కాళ్లను పట్టుకుని లాగి కాపాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో చాలా మంది చూస్తుండగానే వ్యక్తి నీటిలో కొట్టుకుపోతున్నాడు. అయితే అతడిని ఓ వ్యక్తి పట్టుకుని లాగి కాపాడాడు. ఈ వీడియోకు సీఎం కు సంబంధించిన ఓ పాటను పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు.