విడదల రజిని....ఏపీ రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉన్న లేడీ ఎమ్మెల్యే. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి...వెంటనే ఎమ్మెల్యేగా గెలిచి, తక్కువ సమయంలో అదిరిపోయే ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నాయకురాలు. ఎన్ఆర్ఐగా వచ్చిన రజిని 2019 ఎన్నికల ముందు టిడిపిలో చేరి, టిడిపి సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుకు సపోర్ట్‌గా నిలిచారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆమె వైసీపీలో చేరి, అదే ప్రత్తిపాటిపై పోటీకి దిగారు. అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగిన రజిని, రాజకీయ దిగ్గజమైన ప్రత్తిపాటిని చిలకలూరిపేట బరిలో ఓడించడం కష్టమే అని అంతా అనుకున్నారు.