వినాయక పందిళ్లకు అనుమతుల్లేవని విజయవాడ సీపీ, బీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. వినాయక ఉత్సవాలకు ఈ సారి కూడా విగ్రహాలు పెట్టేందుకు ఎటువంటి అనుమతులు లేవని సీపీ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇళ్ళలో చిన్న విగ్రహాలతో వినాయక చవితి చేసుకోవాలని సీపీ ప్రజలకు సూచించారు. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని సీపీ గుర్తు చేశారు. కాబట్టి ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అంతే కాకుండా ఇటీవల విజయ వాడలో వృద్ధురాలి హత్య కేసు గురించి కూడా సీపీ సంచలన విషయాలు వెల్లడించారు. కుందా వారి కండికలో బంగారం కోసమే వృద్ధురాలు సుబ్బమ్మను దుండగులు హత్య చేశారని సీపీ వ్యాఖ్యానించారు.