దొడ్డిదారిన తీసుకుంటున్న అప్పుల గురించి బుగ్గన వివరణ ఇవ్వలేదు. కార్పొరేషన్ల పేరుతో తీసుకుంటున్న అప్పుల గురించి విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించలేదు. అప్పులు పరిమితికి లోబడి తీసుకుంటున్నామంటున్నా.. అవి చట్టబద్దమా కాదా.. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన తీసుకుంటున్నారా.. లేదా.. అన్నదానిపై వివరణ ఇవ్వలేదు.