కరోనా సమయంలో పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో పడినప్పుడు కేసీఆర్ సర్కారు పౌల్ట్రీ పరిశ్రమకు మక్కలు, దాణాలకు రాయితీలు ఇచ్చింది. అయితే.. ఈ సాయం పౌల్ట్రీ పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని చేసిన సాయం కాదట. కేవలం ఈటలకు పౌల్ట్రీ పరిశ్రమ ఉందని దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ఈ సాయం చేశారట. అంతే కాదు. కరోనా వచ్చిన కొత్తలో జనం చికెన్ తినేందుకు కూడా జంకారు. ఆ సమయంలో కేటీఆర్ బహిరంగంగా చికెన్ తిని ప్రజల్లో అపోహలు పొగొట్టే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ ప్రయత్నం కూడా ఈటల రాజేందర్ పౌల్ట్రీ పరిశ్రమను నిలబెట్టేందుకేనట.