రాష్ట్రంలో రహదారులు మృత్యుద్వారాలుగా మారాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. #JSPForAP_Roads అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా రెండున్నర కోట్ల మందికి మన రోడ్ల దుస్థితి చేరిందని పవన్ తెలిపారు. ట్విట్టర్ లో 6.2 లక్షలకుపైగా రోడ్ల పై ట్వీట్లు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అద్వానమైన పరిస్థితిని ప్రజలు, ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ ఈ హ్యాష్ ట్యాగ్ తో మూడు రోజుల పాటు చేపట్టిన ఉద్యమం విజయవంతమైందని పవన్ స్పష్టం చేశారు. లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాంతాల్లోని రోడ్లు ఏ విధంగా పాడైపోయాయో వివరించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూల నుండి రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ శనివారం మధ్యాహ్నంకు దాదాపు 6 లక్షల 20 వేల ట్వీట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నారు. సోషల్ మీడియా ద్వారా దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రజల ముందుకు ఈ సమస్యను తీసుకెళ్లగలిగామంటూ జనసేన అధినేత చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో రోడ్లు ఛిద్రమైపోయినట్టు పవన్ తెలిపారు.