హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ లో గౌడ గర్జన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్ర మంత్రి మురళీధరన్ గౌడ్ హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గౌడ సామాజిక వర్గానికి చేసింది ఏముందని....ఎన్ని హామీలు ఇచ్చారు, ఎం చేశారని మురళీధరన్ గౌడ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేవలం ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం తప్ప చేసేది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు సంవత్సరాల లో కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి దళిత సమాజం కోసం చేసింది ఏముందని....,ఇప్పుడు చేస్తాడా..? అంటూ ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం లో 28 మంది బలహీన వర్గం, 12 మంది దళిత వర్గం మరియు 22 మంది ఎస్టీ వర్గాల ప్రజలకు మంత్రి పదవులు ఇచ్చారని కేంద్ర మంత్రి తెలిపారు.