రతన్ టాటా అవివాహితుడు అన్న సంగతి తెలిసిందే. ఇన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నా ఆయన మాత్రం పెళ్లే చేసుకోలేదు. చాలా మంది ఆయన అసలు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అమ్మాయిని కూడా చూశారు. పెళ్లి నిశ్చయం కూడా అయ్యింది. చివరకు పెళ్లి కార్డులు కూడా ముద్రించారు. అయితే అనూహ్యంగా ఆ పెళ్లి ఆగిపోయింది.