ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశం అయ్యారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ....లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా జగన్ ప్రజలను భ్రమింపజేశారని.. ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని వ్యాఖ్యానించారు. దిశ చట్టం ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు 09-09-21 రోజున నర్సారావు పేట నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వినాయక చవితి పూజలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ వర్థంతికి వర్తించని కోవిడ్ నిబంధనలు... వినాయక చవితికి ఏ విధంగా వర్తిస్తాయని ప్రశ్నించారు. తెలంగాణలో వినాయక పూజలకు అనుమతించగా ఏపీలో ఎందుకు అనుమతి నిరాకరించారని చంద్రబాబు నిలదీశారు.