మద్యపాన నిషేధం ఎన్నటికీ సాధ్యం కాని ఒక హామీ అని చెప్పొచ్చు. అసలు మద్యం ఆదాయమే పభుత్వానికి ప్రధాన ఆధారం. అలాంటిది ఒక నాయకుడు మద్యపాన నిషేధం హామీ ఇచ్చి దాన్ని అమలు చేయడం జరగని పని. గతంలో ఎన్టీఆర్ సైతం ఈ హామీ ఇచ్చి, అమలు చేయాలని చూశారు. కానీ ఆ కాలంలో అది సాధ్యం కాలేదు. కానీ 2019 ఎన్నికల ముందు కూడా జగన్ మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు.