బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి....అధికార వైసీపీలో యువ ఫైర్ బ్రాండ్ నాయకుడు. అతి తక్కువ కాలంలోనే ఏపీ రాజకీయాల్లో ఎదిగిన యువ నేత. తన పదునైన స్పీచ్‌లతో ఆకట్టుకుంటూ, జగన్ మీద విపరీతమైన అభిమానం చూపిస్తూ, తనకు కూడా సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇంత క్రేజ్ ఉన్న బైరెడ్డికి...నందికొట్కూరుపై గట్టి పట్టు ఉంది. ఇక్కడ వైసీపీ తరుపున అభ్యర్ధి ఎవరైనా గెలిపించేది మాత్రం బైరెడ్డి.