కొడాలి నాని, వల్లభనేని వంశీ...కృష్ణా జిల్లా రాజకీయాల్లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు. ఇద్దరు నాయకులు టిడిపి నుంచి ఎదిగిన వారే. ఇక ఇప్పుడు వైసీపీలో కీలక నాయకులు మారిపోయారు. అయితే టిడిపి నుంచి ఈ ఇద్దరు నాయకులకు చంద్రబాబు చెక్ పెట్టలేకపోతున్నారు. వీరికి సొంత ఇమేజ్ ఉండటం వల్ల గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టిడిపికి పుంజుకునే అవకాశం దక్కడం లేదు. దీని వల్ల భవిష్యత్లో మళ్ళీ కొడాలి, వంశీలకు గెలిచే ఛాన్స్ వస్తుందని తెలుస్తోంది.