తల్లుల అకౌంట్స్ లో విద్యాదీవెన వేయడంపై అప్పీలుకు వెళ్తాం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తమ ప్రభుత్వం వైఎస్ ఆర్ స్పూర్తితో పూర్తిగా ఫీజ్ రీ ఎంబెర్స్ చేస్తున్నామని తెలిపారు. తల్లుల అకౌంట్స్ లో వేస్తే ఒక జవాబుదారీ తనం ఉంటుందనే ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు. 40 శాతం మంది విద్యాదీవెన యాజమాన్యాలకు చెల్లించడం లేదనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిలో యాజమాన్యాలు నాన్ సీరియస్ విద్యార్థులను అడ్మిషన్ చేసుకుని ఫీ రీ ఎంబెర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారంటూ విద్యాశాఖ మంత్రి ఆరోపించారు.