ఢిల్లీలో భారత్ పాక్ మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్ల అంశం కూడా ఇరు దేశాలు చర్చించాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో పాక్ తలదూర్చడం పై భారత్ తీవ్రంగా స్పందించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కేంద్రీకృత తీవ్రవాద గ్రూపులతో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సంబంధాలను భారత్ సమావేశంలో ఎత్తిచూపింది. తాలిబన్లు, ఇతర అంతర్జాతీయ తీవ్రవాద గ్రూపులతో పాకిస్తాన్ సంబంధాలను భారత్ నొక్కిచెప్పింది. ఈ సమావేశంలో రెండు దేశాలు దాదాపు అనేక అంశాలపై ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.