ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ ఇవ్వనేలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖను పరిశీలిస్తున్నట్టుగా గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీసీ అభ్యర్థుల పై కూడా కాంగ్రెస్ చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల దాదాపు కొండా సురేఖ హుజురాబాద్ అభ్యర్థిగా ఖరారు అయ్యిందని సోనియమ్మ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ దానిపై మళ్లీ ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు మరియు టీఆర్ఎస్ కు పోటీ ఇవ్వాలంటే కొండా సురేఖనే బరిలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట.