సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంటి ముందు ఆడుతున్న చిన్నారిని చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లిన దుర్మార్గుడు అత్యాచారం చేసి ఆ తరవాత చంపేశాడు. ఈ ఘటనతో సింగరేణి కాలనీ ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే...సింగరేణి కాలనీలో నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉంటోంది. కాగా సెప్టెంబర్ 9న ఇంటి నుండి పిల్లలతో ఆడుకునేందుకు బయటకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. పిల్లలతో కలిసి ఆడుకుంటున్న చిన్నారిని రాజు 30 అనే దుర్మార్గుడు చాక్లెట్ ఆశ చూపించి తీసుకెళ్లి ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు. అనంతరం రాజు చిన్నారిని హత్య చేశాడు.