ఉత్తర్ ప్రదేశ్ యోగి రాష్ట్రంగానే జనాల నోర్లలో తిరుగుతుందంటే అక్కడ బీజేపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు యోగికి దేశ వ్యాప్తంగా అభిమానులు కూడా ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనం ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ మొత్తం ఉత్తర ప్రదేశ్ పైనే పెట్టినట్టు కనిపిస్తోంది. ఎలాగైనా యోగి రాష్ట్రంలో కాంగ్రెస్ జండాను ఎగరవేయాలని అదిష్టానం నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. దాంతో ఏకంగా ఉత్తర్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ రంగంలోకి దిగుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున సీఎం కాండిడేట్ గా అధిష్టానం ప్రియాంక గాంధీని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ యువత అంతా బీజేపీ వైపే ఉంటారు.