పాకిస్థాన్ సీఎంతో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దూకు సంబంధాలు ఉన్నాయంటూ నేడు సీఎంగా రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన అమరీందర్ సింగ్ సిద్దూపై మండిపడ్డారు. సిద్దూకు పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయని..పాకిస్థాన్ ఆర్మీ అధికారితో కూడా సంబంధాలున్నాయని చెప్పారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ అధికారి జావీద్ బజ్వా సిద్దూకు మంచి స్నేహితులు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేల సిద్దూను సీఎం అభ్యర్థిగా అనుకుంటే తాను వ్యతిరేకిస్తానని అమరీందర్ చెప్పారు. అతడిని సీఎం కుర్చీపై కూర్చోపెడితే దేశ రక్షణకే ప్రమాదం అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. త్వరలోనే సిద్దూ పొలిటికల్ కెరీరీ మొత్తం నాశనం అవుతుందంటూ వ్యాఖ్యానించారు.