సోమవారం ఏపీ మంత్రి పేర్నినాని సీనీ పెద్దలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే . ఈ సమావేశంలో పేర్నినాని చిరంజీవి ఆదివారం లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన విజ్క్షాపనను గుర్తు చేశారు. చిరంజీవి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఆదుకోవాలని కోరటంపై పేర్ని స్పందించి సీఎం జగన్ కు చిరంజీవి అంటే చాలా ఇష్టమని ..సోదర భావంతో ఉంటారని చెప్పారు . చిరంజీవి చేసిన విజ్ఞాపణను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అంతే కాకుండా పేర్నినాని మాట్లాడుతూ...ఆన్లైన్ టికెటింగ్ విధానంపై సీనీ పెద్దలతో చర్చించామని అలాగే సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి చర్చించామని చెప్పారు .