ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన నియోజవర్గానికి వచ్చి తనకు రేవంత్ సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి మీడియా మందుకు వచ్చి ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి రేవంత్ తో పాటూ పార్టీని కూడా ఇందులోకి లాగారు. కాంగ్రెస్ పార్టీనా ప్రైవేట్ లిమిటెడ్ పార్టీనా అంటూ సంచన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు గౌరవం లేదంటూ జగ్గారెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది...ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండి పడ్డారు. నాకు కూడా అభిమానులు ఉన్నారు రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదంటూ రేవంత్ రెడ్డిని అన్నారు.