నగరంలో మురుగునీటి శుద్ధిపై గత ప్రభుత్వాలకు ఇంత చిత్తశుద్ధి లేదంటూ మంత్రి తలసాని మండిపడ్డారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండటం నగర ప్రజల అదృష్టమని తలసాని వ్యాఖ్యానించారు. సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, తాగునీటి కోసం 5 వేల కోట్లను కేటాయించారని తలసాని గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి కూడా పెరుగుతోందని తలసాని వెల్లడించారు. వచ్చే 25 ఏళ్లకు ప్రణాళికలు ఉండాలని షా కన్సల్టెన్సీ తో సర్వేలు చేయించినట్టు తెలిపారు. కేసీఆర్ కు నగర ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున కృతజ్ఞతలని తలసాని అన్నారు. రెండేళ్లలో 31 సివరేజ్ ప్లాట్లు పూర్తయితే దేశంలో మనమే నెంబర్ 1 గా ఉంటామని తలసాని వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామాలకు తాగునీటి కోసం మొత్తం 1200 కోట్లు ఇచ్చారని తలసాని గుర్తు చేశారు.