తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫాన్ గా మారిపోయింది.. ఇక ఆ తుఫాన్ కు గులాబ్ గా నామకరణం చేశారు. గోపాలపూర్ కు 370కిమీ అదేవిధంగా కళింగపట్నానికి 440 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్టు వాతావరణశాఖ అధికారులు గుర్తించారు. వాయుగుండం పశ్చిమ దిశగా పయనించి రేపు సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అదికారులు చెబుతున్నారు. రేపు ఉత్తరాంధ్రలో తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన చోట్ల కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.