పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పార్ట్ -2 చాలా ఘాటుగా సాగింది. పవన్ కల్యాణ్ అభిమానులు తనని బాగా హర్ట్ చేసారంటూనే.. పోసాని నేరుగా పవన్ కల్యాణ్ పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఆ సందర్భంలో చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పోసాని. చిరంజీవి రియల్ హీరో అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు.