అనంతపురం జిల్లా కొత్త చెరువు రహదారి మరమ్మతు పనులకు పవన్ కల్యాణ్ వస్తారని ప్రకటించారు. తానే స్వయంగా వచ్చి అక్కడి రోడ్డు రిపేర్ చేస్తామని, జనసైనికులు శ్రమదానం చేస్తారని చెప్పారు పవన్ కల్యాణ్. పవన్ ప్రకటన విడుదల చేసిన తర్వాత స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు అలర్ట్ అయ్యారు. జనసేన శ్రమదానం చేస్తే ఆ క్రెడిట్ వారికి దక్కుతుందేమోనన్న ఆలోచనతో హడావిడిగా పనులు మొదలు పెట్టారు.