పవన్ కల్యాణ్ తో సినిమాలు చేయాలని చాలామంది నిర్మాతలకు ఆశ, పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించాలనేది చాలామంది దర్శకుల కల. కనీసం ఆయన పక్కన ఒక్క సీన్ లో నటించే అవకాశం వచ్చినా చాలని అప్ కమింగ్ ఆర్టిస్ట్ లు చాలామందే అనుకుంటుంటారు. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు చెబితేనే ఒకరకమైన ఉద్విగ్న వాతావరణం ఇండస్ట్రీలో నెలకొంటున్నట్టు తెలుస్తోంది. పవన్ పవన్ అంటూ కలవరించే దిల్ రాజు సైతం.. ఆయన్ను వదిలిపెట్టి వైసీపీ ప్రభుత్వం దగ్గరకు చేరిపోయారు.