భూపాల్ పల్లి లో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సంధర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణలో సింగరేణి కార్మికుల హక్కులను కేసీఆర్ కాలరాశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సింగరేణిని బొందలగడ్డగా మార్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 1200 మంది అమరులైంది కేసీఆర్ కుటుంబం కోసమా...? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ నక్సలైట్ల ఎజెండా అన్నారు.. ఏమైంది..? అంటూ రేవంత్ ప్రశ్నలు కురిపించారు. కేసీఆర్ వేలకోట్లు దోచుకోమని నక్సలైట్ల ఎజెండాలో ఉందా అంటూ రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన యువకులు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంతో నష్టపోయినా కూడా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.