పంజాబ్లో రోజు రోజుకు పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. దాంతో పంజాబ్ రాజకీయాల్లొ రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. దాంతో పంజాబ్ లో రాజకీయ పరిణామాలు ఎవరూ ఊహించని విధంగా మారుతుండటం కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పంజాబ్ మాజీ ముఖ్య మత్రి అమరీందర్ సింగ్ గుడ్ బై చెప్పేశారు. అంతే కాకుండా కాంగ్రెస్లో ఇక కొనసాగను అని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను ప్రస్తుతం బిజెపిలో కూడా చేరడం లేదని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. అమిత్ షా మరియు ఇతర బీజేపీ కీలక నేతలతో సమావేశం తరవాత అమరీందర్ సింగ్ బీజేపీ లోకి వెళుతున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కాగా అమరీందర్ సింగ్ ఆ వార్తలకు తాజాగా చెక్ పెట్టేశారు.