ఏపీలో రేషన్ కష్టాలు మొదలు కాబోతున్నాయి. ఈకేవైసీ రూపంలో రేషన్ కార్డుదారులకు చుక్కలు చూపెట్టడానికి రెడీ అయింది రాష్ట్ర ప్రభుత్వం. ఈకేవైసీ చేయించుకోని వారికి రేషన్ ఇవ్వలేమని అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. దీంతో జనాలు మీసేవా సెంటర్ల మీదకు దండయాత్ర చేశారు. అయితే ఇలా అందరూ ఒక్కసారిగా మీసేవా సెంటర్లమీద పడడంతో.. గడువేమీ లేదని.. ఎప్పుడైనా ఈకేవైసీ చేయించుకోవచ్చని అధికారులు ప్రకటన విడుదల చేశారు. తీరా ఇప్పుడు చూస్తే.. ఈనెల రేషన్ తో ఈకేవైసీ నిబంధన అమలులోకి తెచ్చేశారు.