తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల సమయంలో బీజేపీకి జనసేన మద్దతిచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా ఈసారి బద్వేల్ సీటును జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ, జనసేన నేతలు కలిసి చర్చలు జరిపారు. బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో జనసేన ఇక్కడ కచ్చితంగా ప్రభావం చూపాలని అనుకుంటోంది. ఇక్కడ గతంలో జనసేన మద్దతిచ్చిన బీఎస్పీ అభ్యర్థి నాగిపోగు ప్రసాద్ కి, గతఎన్నికల్లో 1321 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ తరపున పోటీ చేసిన తిరువీధి జయరాములుకి కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో మాట్లాడిన పవన్.. తమకు బద్వేల్ లో పట్టుందని.. అవకాశం వస్తే నిరూపించుకుంటామని అన్నారు.