ఇప్పటి వరకూ రోడ్లకు మరమ్మతులు చేయకపోవడానికి వర్షాలు, తుపాన్లు కారణం అంటూ సజ్జల కవర్ చేసుకున్నా.. ఇప్పటికే ఈ విషయం జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తోంది. పవన్ కళ్యాణ్ పర్యటిస్తానని, శ్రమదానం చేస్తానని చెప్పిన రోడ్లన్నింటికీ ప్రభుత్వం మరమ్మత్తు పనులను పూర్తి చేసింది. దీంతో జసైనికులు తెగ ఆనంద పడిపోతున్నారు. జనసేన అధినేత పవన్ కార్యాచరణ ప్రకటించిన తర్వాతే వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేసిందంటూ జనసైనికులు ప్రచారం కూడా మొదలెట్టారు. సాధారణంగా సీఎం వస్తే.. రోడ్లు వేస్తారని.. కానీ తమ అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే రోడ్లు వేస్తున్నారంటూ మీమ్స్ కూడా చేస్తున్నారు.