సామాజిక పింఛన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నెల పింఛన్ల విషయంలో ఎక్కడా కోతలు లేవని ప్రకటించింది. గత నెలకంటే ఈ నెలే ఎక్కువగా పింఛన్లు ఇచ్చామని చెప్పుకుంటోంది. టీడీపీ హయాంలో కంటే ఇప్పుడు మూడు రెట్లకు పైగా అధికంగా పింఛన్లు అందిస్తున్నామని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. గత సెప్టెంబర్ నెలలో 59.19 లక్షల మందికి పింఛన్లు ఇవ్వగా.. అక్టోబర్లో 60.81 లక్షల మందికి పెన్షన్లు అందించినట్టు వైసీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు.