పవన్ కళ్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం ముగిసింది. ఏపీలో రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేసిన శ్రమదానం అనుకున్న స్థాయిలోనే విజయవంతమైంది. ఏపీ ప్రభుత్వం రోడ్లకు మరమ్మత్తు పనులు కూడా మొదలుపెట్టింది. దీంతో పవన్ సక్సెస్ కొట్టినట్టే అయింది. ఇటు రాజమండ్రిలోనూ.. అటు పుట్టపర్తి కొత్త చెరువులో జరిగిన రెండు సభలు కూడా విజయవంతం కావడంతో జనసైనికులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు చాలామందికి అర్ధంకాని విషయం ఏమిటంటే.. పవన్ తర్వాత కార్యాచరణ ఏమిటి..? శ్రమదానం అనంతరం ఏ అంశంపై మాట్లాడబోతున్నాడు.. అనేది హాట్ టాపిక్ గా మారింది.