బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బద్వేల్ ఉపఎన్నికల విషయంలో మొదట నుంచి ఉత్సాహం చూపిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో చేసినట్టే.. బద్వేల్ లో కూడా పోటీ చేయాలని భావించారు. చివరి నిమిషంలో జనసేన అభ్యర్థిని పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు జనసేన పక్కకు తప్పుకోవడంతో బీజేపీ కూడా ఆలోచనలో పడింది. తమ మిత్రపక్షమైన పవన్ ప్రకటనను గౌరవించి బీజేపీ బద్వేల్ ఉపఎన్నికల పోరు నుంచి తప్పుకుంటుందా లేదా అనేది అనుమానమే.