కొంతకాలంగా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను జనసేన పోషిస్తోందని అనిపిస్తోంది. టీడీపీ ఆరోపించిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్సలు స్పందించలేదు. కేవలం ప్రజల సమస్యలపై పోరాటాన్ని ప్రారంభించి.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. రోడ్ల సమస్యలపై పోరాటం చేసి జనంలో మంచిపేరు తెచ్చుకున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. రాష్ట్రమంతటా వరుస పర్యటనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పవన్.. ఇలా దూసుకెళ్తుంటే టీడీపీ మాత్రం ఎందుకో వెనుకబడిపోయింది. ఇప్పటికైనా జనం గుర్తించే సమస్యలను టీడీపీ పట్టించుకుంటుందా..? లేక అదే పాత ఫార్ములాతో ముందుకెళ్తుందో చూడాలి..!