భారత్ లో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ రెడీ అవుతుందనే విషయం తెలిసిందే. జైడస్ క్యాడిలా కంపెనీ జైకోవ్-డి పేరుతో దీన్ని మార్కెట్ లోకి తెస్తోంది. ఇప్పటికే అత్యవసర అనుమతి లభించడంతో తుది ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్నారులకు ఇచ్చే టీకా మూడు డోసుల్లో ఉంటుందని, ఇది నీడిల్ లెస్ టీకా అని, సూది అవసరం లేకుండా ఈ డీఎన్ఏ టీకాను వేస్తారని ముందుగానే సదరు కంపెనీ ప్రకటించింది. అయితే దీని ధరపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. మూడు డోసుల రేటు దాదాపు 2వేల రూపాయలు ఉంటుందని కంపెనీ తెలిపింది.