బద్వేల్ ఉప ఎన్నికల బరిలో జనసేన ఉండదని పవన్ కల్యాణ్ చెప్పిన మరుసటి రోజే చంద్రబాబు కూడా ఎన్నికలకు వెళ్లడంలేదని చెప్పడం విశేషం. అంటే పవన్ కోసమే బాబు ఈ ప్రణాళికను అమలు చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయనే వాదనకు ఈ పరిణామం మరింత బలం చేకూరుస్తోంది. నిజంగా ఆనవాయితీ ప్రకారం అయితే గతంలోనే చంద్రబాబు అక్కడ పోటీచేయడంలేదని చెప్పేవారని, కానీ పవన్ ప్రకటన తర్వాతే టీడీపీ తరపున కూడా ప్రకటన వెలువడటం వెనక కచ్చితంగా రాజకీయ కోణం ఉందని అంటున్నారు.