టీడీపీ-జనసేన జట్టు కడితే ఏ పార్టీకి ఎక్కువ లాభం, ఏ పార్టీకి నష్టం అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో కొంతమంది టీడీపీ నేతలు తమ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. అదే సమయంలో జనసేన బరిలో దిగలేదు కాబట్టి కాంపిటీషన్ పెద్దగా లేదు. కానీ ఇప్పుడు జనసేన ఏపీలో తన బలం పెరిగిందని బలంగా వాదిస్తోంది. పరిషత్ ఎన్నికల్లో బీజేపీకంటే ఎక్కువ స్థానాలు సాధించింది. టీడీపీతో కలసి కొన్ని ఎంపీపీ సీట్లను కూడా ఉమ్మడిగా గెలుచుకుంది. ఈ దశలో జనసేన డిమాండ్ చేసినన్ని సీట్లు టీడీపీ ఇచ్చి తీరాల్సిందే.