హుజూరాబాద్ ఉప ఎన్నికలకు టైమ్ దగ్గరపడే కొద్దీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ వాటాలు పంచేసుకున్నారు. ఒకరు బీజేపీని టేకప్ చేస్తే, మరొకరు కాంగ్రెస్ సంగతి చూడటానికి డిసైడ్ అయ్యారు. వెంటనే తమ యాక్షన్ ప్లాన్ అమలులో పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేదికగా బీజేపీ పరువు తీయడానికి రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. అటు కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.