ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో చాలామంది తమకి బెర్త్ ఖాయం అని అనుకుంటున్నారు. జగన్ టీమ్ లో నూటికి నూరు శాతం మార్పులుంటాయని, అంతా కొత్తవారినే తీసుకుంటారని ఇటీవల మంత్రి బాలినేని చేసిన వ్యాఖ్యలు ఆశావహుల్లో మరిన్ని ఆశలు చిగురింపజేశాయి. ప్రతి జిల్లాలోనూ చాలామంది ఆశావహులు, గతంలో మంత్రి పదవి రాని సీనియర్లు రెండో దఫా తమ ప్రయత్నాలు చేస్తున్నారు.