బతుకమ్మ కోసం ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాట రూపొందించారు. దీన్ని గతంలో ఎన్నో విజయవంతమైన తెలంగాణ పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్ రాయగా.. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రీకరించారు. ఈ విషయం తెలిసి చాలా మంది ఈ పాట విడుదల కోసం ఎంతగానో ఎదురు చూశారు. అయితే... తీరా వచ్చాక ఆ పాట చూసి ఒక్కసారిగా నీరసపడిపోయారు.