ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనిపై రెండు, మూడు రోజుల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం పై క్లారిటీ రాగానే మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేశారు. గత కొంత కాలంగా తమను తెలంగాణకు బదిలీ చేయాలని తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పలుమార్లు విన్నవించారు. తమ కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయని, తాము ఏపీలో ఉద్యోగం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు మొరపెట్టుకున్నారు.