మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఎవరికీ మద్దతివ్వడంలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి క్లారిటీ ఇచ్చారు. అయితే అక్కడే చిన్న సమస్య వస్తోంది. అసలు మద్దతు ఇవ్వనప్పుడు దాన్ని బహిరంగంగా ప్రకటించడం ఎందుకు..? అనవసరంగా 'మా' ఎన్నికలతో మాకు సంబంధం లేదు అని చెప్పుకోవడం ఎందుకు.. ఎన్నికలైపోయే వరకు సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్, సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.