కరోనా కష్టకాలంలో చట్ట సభల సమావేశాలు చాన్నాళ్లు వాయిదా పడ్డాయి. సభలు తిరిగి మొదలైనా.. కరోనా భయంతో ఎవరు వస్తారో, ఎవరు రాలేరో తెలియని పరిస్థితి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన రాజ్యసభలో మంచి హాజరు నమోదు కావడం విశేషం. సగటున 78శాతం మంది సభ్యులు ప్రతి సమావేశానికీ హాజరయ్యారు. 2019 నుంచి 2021 మధ్య కాలంలో ఏడు సెషన్లలో జరిగిన 138 సమావేశాలలో ఈ హాజరు శాతం నమోదైంది.