ఇప్పుడు మరో తెలుగు చానల్ ఆస్తులు ఈడీ చేతికి చిక్కాయన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షి పత్రికకు చెందిన పలు ఆస్తులు ఈడీ చేతికి వెళ్ళాయి. అయితే ఇప్పుడు తాజాగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో మరో తెలుగు న్యూస్ ఛానల్ ప్రస్తుత ఓనర్లకు సంబంధించిన షేర్లను ఈడీ జప్తు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.