ఇప్పుడు కేసీఆర్తో గట్టిగా పోరాడాలా వద్దా.. అసలు పోరాడినా కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో పెట్టుకున్న స్నేహంతో ఏమైనా ఫలితం ఉంటుందా.. అన్న ఆలోచన బీజేపీ నేతల్లో బయలుదేరింది. ఏదేమైనా కేసీఆర్ ఓ మాట అన్నాడంటే.. దాని వెనుక చాలా వ్యూహం ఉంటున్నదన్న సంగతి తెలిసిందే. ఆ వ్యూహమేంటన్నది మాత్రం అంతుచిక్కకుండానే ఉంది.