కాంగ్రెస్లో ఉండి పోరాడలేని నేతలు నిస్సంకోచంగా పార్టీ వదిలి వెళ్లవచ్చని ఇటీవల రాహుల్ కామెంట్ చేశారు. అంతే కాదు.. ఇటీవల పార్టీలోకి ఇతర పార్టీల నుంచి యువ నాయకులను చేర్చుకుంటున్నారు. కన్నయ్య కుమార్, జిగ్నేశ్ మేవాని వంటి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. జీ 23 గ్రూపు నాయకులను ఈ యువ నాయకత్వం ద్వారా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.