తెలుగు రాష్ట్రాల్లో సర్కారు చదువులు కష్టాల్లో పడ్డాయా.. యునెస్కో నివేదికలు అసలేం చెబుతున్నాయి..? తాజాగా విడుదల చేసిన గణాంకాలు చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి కళ్ళకు కడుతుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోని 9,160 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ‘నో టీచర్ నో క్లాస్.. స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా-2021’ పేరుతో యునెస్కో విడుదల చేసిన నివేదిక ఈ సంచలన విషయాలు బయటపెట్టింది.