అందాల కాశ్మీరంలో మళ్లీ అరాచకం ప్రబలుతోంది. ప్రత్యేకించి కాశ్మీర్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కులు ఇతర మతాలకు చెందిన వారిపై మళ్లీ దాడులు పెరుగుతున్నాయి. ఈ వర్గాలపై ఉగ్రవాదులు వరుస దాడులతో మళ్లీ భయాందోళనలు రేకెత్తిస్తున్నారు.